ఉదయనిధి స్టాలిన్​కు మంత్రి పదవి

ఉదయనిధి స్టాలిన్​కు మంత్రి పదవి

యూత్ ​వెల్ఫేర్ ​అండ్ ​స్పోర్ట్స్ డెవలప్​​మెంట్​ శాఖ కేటాయింపు

చెన్నై: తమిళనాడులోని అధికార డీఎంకే ఎమ్మెల్యే, ఆ స్టేట్ ​సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ బుధవారం యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌‌భవన్‌‌లో గవర్నర్ ఆర్‌‌ఎన్ రవి.. ఉదయనిధితో ప్రమాణం చేయించారు. సీఎం ఎంకే స్టాలిన్, పలువురు మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ఉదయనిధి సచివాలయంలో అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఉదయనిధి మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాల ఆరోపణలు తనకు కొత్తేమీ కాదని, ఆ విమర్శలకు తన పని ద్వారా సమాధానం ఇస్తానని చెప్పారు.