వరంగల్ లో  ఉగాది సందడి..  భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

వరంగల్ లో  ఉగాది సందడి..  భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా గురువారం వరంగల్ గ్రేటర్​ లోని దేవాలయాలలో సందడి నెలకొంది. వసంత నవరాత్రుల నేపథ్యంలో భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించారు. వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై  ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం భద్రకాళి అమ్మవారికి పసుపు రంగు చామంతికా పుష్పాలతో లక్ష పుష్పార్పన నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, ఈవో సునీత, ధర్మకర్తలు తదితరులు ఉన్నారు.