ప్రగతి భవన్ జనహితలో ఉగాది వేడుకలు

ప్రగతి భవన్ జనహితలో ఉగాది వేడుకలు

హైదరాబాద్: ఉగాది పర్వదినాన్ని ప్రగతి భవన్లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర వేడుకలను ప్రగతి భవన్ లోని జనహిత వేదిక కానుంది. వేడుకల నిర్వాహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్కే భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అధర్ సిన్హా, అర్వింద్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ అనిల్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. 

ప్రగతి భవన్ లోని జనహితలో ఏప్రిల్ 2 ఉదయం 10:30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం బాచుపల్లి సంతోష్ కుమార్ శర్మచే పంచాంగ పఠనం ఉంటుంది. వేద పండితులకు ఉగాది పురస్కారాలు అందజేసిన అనంతరం సీఎం కేసీఆర్ సందేశం ఉంటుందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఉగాది పర్వదినం రోజు సాయంత్రం ఆరున్నరకు రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం ఉంటుంది. 

మరిన్ని వార్తల కోసం..

టీఆర్ఎస్ ఎంపీలకు కోమటి రెడ్డి సవాల్

దామాషా ప్రకారం రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే హక్కుంది