దామాషా ప్రకారం రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే హక్కుంది

దామాషా ప్రకారం రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే హక్కుంది
  • చిత్తశుద్ధి ఉంటే సాయంత్రానికల్లా ఎస్టీల రిజర్వేషన్ పెంపు జీవో తీసుకురండి.. అడ్డుకుంటే అడగండి
  • మీడియాతో చిట్ చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. కేంద్రం ఎన్నిచేసినా.. ఏమీ ఇవ్వలేదని కేసీఆర్ తొండాట ఆడుతున్నారని అన్నారు. పక్క రాష్ట్రం అంధ్రప్రదేశ్ కు ఎలాంటి ఇబ్బంది రావడం లేదు.. కానీ కేసీఆర్ కే ఎందుకు ఇబ్బంది వస్తోందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సాయంత్రానికల్లా ఎస్టీల రిజర్వేషన్ పెంపు జీవో తీసుకురమ్మనండి.. అడ్డుకుంటే అడగండని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ కు హుజురాబాద్ ఓటమి తర్వాతే వరిధాన్యం అంశం గుర్తుకొచ్చిందన్నారు. రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటామని ఆయన పునరుద్ఘాటించారు. గతంలో నిర్దేశించిన టార్గెట్ కూడా కేసీఆర్ ఇవ్వలేకపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

 

ఇవి కూడా చదవండి

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్

రోజు రోజుకూ ముదురుతున్న ఎండలు

సైంటిస్టుల కంటే రైతులకే బాగా తెలుసు

టీఆర్ఎస్ ఎంపీలకు కోమటి రెడ్డి సవాల్