ఉగాది కానుకగా మహేష్ బాబు నెక్స్ట్ మూవీ

ఉగాది కానుకగా మహేష్ బాబు నెక్స్ట్ మూవీ

ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ బాబు.. తన తర్వాతి సినిమా రాజమౌళి డైరెక్షన్‌‌లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని  ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్‌‌కు తీపి కబురు అందింది. ఏప్రిల్ 9న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని ప్రారంభించేలా ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌‌లో బిజీగా ఉన్న రాజమౌళి ఈ చిత్రం కోసం వర్క్ షాప్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.

ALSO READ : రియల్ లైఫ్‌‌తో రిలేట్ చేసుకునేలా..

అలాగే  రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు సరికొత్త గెటప్‌‌లో కనిపించనున్నాడని, దానికోసం ఆయన మేకోవర్ అవుతున్నాడు.  రాజమౌళి తండ్రి  విజయేంద్ర ప్రసాద్‌‌ అందించిన ఈ  కథను  ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కించనున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలని, అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫస్ట్ పార్ట్‌‌ను  2026 లో రిలీజ్‌‌ చేయాలనుకుంటున్నారట. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.