కొత్త ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్ లాంచ్‌‌‌‌‌‌‌‌..బయోమెట్రిక్ లాక్ ద్వారా డేటా సేఫ్

కొత్త ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్ లాంచ్‌‌‌‌‌‌‌‌..బయోమెట్రిక్ లాక్ ద్వారా డేటా సేఫ్

న్యూఢిల్లీ:  యూనిక్ ఐడెంటిఫికేన్ అథారిటీ ఆఫ్  ఇండియా  కొత్త ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ను లాంచ్‌‌‌‌ చేసింది. ఈ యాప్  ద్వారా  ఆధార్ కార్డును సురక్షితంగా స్టోర్ చేసి, ఇతరులతో పంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్‌‌‌‌‌‌‌‌, ఐఓఎస్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త యాప్‌‌‌‌‌‌‌‌ ఎంఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యామ్నాయం కాదు. కానీ, దీనిని ఆధార్ కార్డు చూపించేందుకు, పంచుకునేందుకు వాడుకోవచ్చు. ఈ యాప్‌‌‌‌‌‌‌‌లో ఒకే మొబైల్ నంబర్‌‌‌‌‌‌‌‌కు లింక్ అయిన 5 ఆధార్ ప్రొఫైల్స్ వరకు స్టోర్ చేయవచ్చు. డిజిటల్ ఆధార్‌‌‌‌‌‌‌‌ను క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్ లేదా ఇతర మార్గాల్లో  పంచుకోవచ్చు. బయోమెట్రిక్ లాక్ ద్వారా డేటాను రక్షించుకోవచ్చు.   ఫేస్ అథెంటికేషన్, ఓటీపీ  ద్వారా లాగిన్ అవ్వాలి.