Cricket World Cup 2023: ఊగిపోతున్న ఇండియా.. కాసేపట్లో క్రికెట్ లాక్ డౌన్

Cricket World Cup 2023: ఊగిపోతున్న ఇండియా.. కాసేపట్లో క్రికెట్ లాక్ డౌన్

దేశం మొత్తం క్రికెట్ తో ఊగిపోతుంది.. వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలవటంతో.. జనం అంతా చక చకా పనులు చేసుకుంటున్నారు.. మధ్యాహ్నంలోపు అన్ని పనులకు కంప్లీట్ చేసుకుని టీవీల దగ్గర అతుక్కోవటానికి సిద్ధం అయ్యారు. 140 కోట్ల మందే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్స్.. ఆస్ట్రేలియా ప్రజలతోపాటు ఇతర దేశాల్లోని క్రికెట్ అభిమానులు అందరూ ఇప్పుడు.. ప్రపంచ క్రికెట్ విజేత ఎవరు.. మొనగాళ్లకు మొనగాడు ఎవడు.. విశ్వ విజేత ఎవరు కాబోతున్నారనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు..

ఇప్పటికే క్రికెట్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది.. ఉదయం నుంచి అభిమానులు.. గుళ్లు, గోపురాల్లో పూజలు చేస్తున్నారు. హోమాలు చేయిస్తున్నారు.. యాగాలు చేస్తున్నారు. ఇండియా జీతేగా.. ఇండియాదే కప్.. కమాన్ ఇండియా అంటూ జోష్ గా ఉన్నారు. 

కుర్రోళ్లు మాత్రమే కాదు.. ప్రతి ఇంట క్రికెట్ మోత మోగనుంది.. ఫ్యామిలీలకు ఫ్యామిలీలు క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేయటానికి సిద్ధం అయ్యారు. సిటీల్లోని అపార్ట్ మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే స్పెషల్ ఈవెంట్స్ అరేంజ్ చేశారు. ఇక సిటీల్లోని బార్లు, పబ్స్, రెస్టారెంట్లు బిగ్ స్క్రీన్లతో ఆఫర్స్ ప్రకటించాయి. 

జనం అంతా క్రికెట్ కోసం టీవీలకు అతుక్కుపోయే సమయం కావటంతో.. ఇండియాలో క్రికెట్ లాక్ డౌన్ కాబోతుంది సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.. దేశంలో మరోసారి రోడ్లు నిర్మానుష్యం కాబోతున్నాయి.. రోడ్లపై జనం అందరూ ఇళ్లకు వెళ్లిపోతారు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇండియాలో క్రికెట్ లాక్ డౌన్ వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

చిన్నా.. పెద్దా అని తేడా లేదు.. పల్లె పట్నం అని బేధం లేదు.. ఆ భాష.. ఈ భాష అని లేదా.. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అని తేడా లేదు.. గల్లీ నుంచి దేశ ప్రధాని వరకు అందరూ క్రికెట్ మాయలో ఉన్నారు.. జనాన్ని మాయ చేయటానికి మన 11 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు.. 

కప్ కొట్టేదెరు అనేది మాత్రమే ఇప్పుడు పాయింట్.. దేశం ఎదురుచూస్తున్న పెద్ద ప్రశ్న.. సమాధానం కోసమే ఇండియాలో క్రికెట్ లాక్ డౌన్...