
మాయదారి మహమ్మారి కరోనా ఖతం అయ్యిందని ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు మరోసారి పిడుగులాంటి వార్త వచ్చి పడింది. యూకేలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.అక్కడ రోజువారీ కేసులు రెట్టింపు అవ్వడంపై మరింత అప్రమత్తంగా ఉండాలని అమెరికా వైద్యుడు ఆంథోనీ పౌసీ చెప్పారు. బ్రిటన్ లో పెరుగుతున్న కేసులు, పేషెంట్లు ఆస్పత్రుల్లో చేరడంపై యునైటెడ్ స్టేట్స్ నిశితంగా గమనిస్తోందన్నారు. ఇప్పుడు బ్రిటన్ లో BA.2 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని చెప్పారు. టీకాలు వేసుకోని వారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఈ వైరస్ భారిన పడుతున్నారని చెప్పారు. ఈ వైరస్ మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. కరోనా ఇప్పట్లో అంతం అయ్యేలా కనిపించడం లేదని..అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరిన్ని వార్తల కోసం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్
‘జూనియర్’కు జంటగా శ్రీలీల