క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్

క్షమాపణలు చెప్పిన  బ్రిటన్ ప్రధాని రిషి సునక్

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు. డ్రైవింగ్  చేసేటప్పుడు  సీటు బెల్ట్ పెట్టుకోకుండా తప్పు చేశానని రిషి సునాక్ అంగీకరించారు.  రిషి సునక్ గురువారం నార్త్ - వెస్ట్ ఇంగ్లండ్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియా వీడియో తీయడానికి తన సీట్ బెల్ట్ తొలగించడంలో పొరపాటు జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని రిషి సునక్ కోరారు. యూకే చట్టాల ప్రకారం. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్‌  బెల్ట్ ధరించకపోతే డ్రైవర్లు, ప్రయాణీకులకు 500 పౌండ్ల జరిమానాను విధిస్తారు.