మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు గురువారం కొనసాగింది. ఈ లెక్కింపులో గత నాలుగు నెలలగా లక్ష పది రూపాయల నగదుతోపాటు యూకే కరెన్సీ 20 పౌండ్లు హుండీ ఆదాయంగా వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు, ఆలయ ఈవో వసంత తెలిపారు. కాగా, గత కొన్నేండ్లుగా వెండి, బంగారం లెక్కలు వెల్లడించడం లేదని స్థానిక భక్తులు
ఆరోపిస్తున్నారు.
