
- పలు విమానాలు ఆలస్యం
టోక్యో: యూకే రాయల్ ఫోర్స్ కు చెందిన ఎఫ్35 బీ ఫైటర్ జెట్ జపాన్ లోని కాగోషిమ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉండగా.. టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో జెట్ ను కాగోషిమ సిటీలోని విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన తరువాత రన్ వేను 20 నిమిషాల పాటు మూసివేశారు. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి.
కాగా.. రాయల్ ఫోర్స్ కే చెందిన ఎఫ్ 35 బీ ఫైటర్ జెట్ జూన్ 14న కేరళలోని తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. జెట్ యూకే నుంచి ఆస్ట్రేలియా వెళుతుండగా టెక్నికల్ సమస్య రావడంతో దానిని తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఐదు వారాల తర్వాత విమానంలోని సమస్యను రెక్టిఫై చేశాక ఫైటర్ యూకేకు తిరిగి వెళ్లింది.