ఆయుధాలు వదిలేస్తే కాపాడ్తం

ఆయుధాలు వదిలేస్తే కాపాడ్తం
  • ఆయుధాలు వదిలేస్తే కాపాడ్తం
  • కొత్త జీవితం, సెక్యూరిటీ కల్పిస్తం
  • రష్యా బలగాలకు ఉక్రెయిన్  మంత్రి పిలుపు

కీవ్, న్యూయార్క్​: ‘ఆయుధాలు వదిలేసి, లొంగిపోతే భద్రతతో కూడిన కొత్త జీవితాన్ని అందిస్తం’ అంటూ ఉక్రెయిన్​ రక్షణ శాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్​ రష్యా బలగాలకు పిలుపునిచ్చారు. ‘మీ దేశం మరింత విషాదంలోకి జారిపోకుండా, రష్యా ఆర్మీ ఘోర అవమానాన్ని ఎదుర్కోకుండా కాపాడుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందన్నారు. ఇందుకోసం మీరు ఆయుధాలను వదిలేయండి. యుద్ధం చేయడానికి నిరాకరించేటోళ్ల ప్రాణాలకు మేము భరోసా ఇస్తం’ అని రెజ్నికోవ్​ చెప్పారు. రష్యా సోల్జర్లను ఉద్దేశించి విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయనీ కామెంట్లు చేశారు.

యుద్ధంలో రష్యా ఆర్మీ పెద్ద సంఖ్యలో బలగాలను, ఆఫీసర్లను కోల్పోయిందని, సాధారణ పౌరులనూ యుద్ధ రంగంలోకి తరలిస్తోందని అక్కడి మీడియా వెల్లడిస్తోంది. ఈ క్రమంలో యుద్ధంలో పాల్గొనేందుకు చాలామంది రష్యన్లు అంగీకరించట్లేదని, ఆర్మీలో చేరకుండా తప్పించుకునేందుకు పక్క దేశాలకు పారిపోతున్నరనీ కథనాలు ప్రచురించాయి. ఉక్రెయిన్ తో జరుగుతున్న ఈ యుద్ధంలో చేరలేక కొంతమంది రష్యన్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్​ రక్షణ మంత్రి రష్యన్​ సోల్జర్లను ఉద్దేశించి ఈ వీడియో సందేశం విడుదల చేశారు.

అపార్ట్​మెంట్లపై డ్రోన్లతో దాడి.. 

జపొరిజియా సిటీలోని అపార్ట్​మెంట్లను రష్యా టార్గెట్​ చేసింది. పేలుడు పదార్థాలతో ప్యాక్ చేసిన డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీంతో చాలా అపార్ట్ మెంట్లు ధ్వంసమయ్యాయి. తాము పట్టుకోల్పోయిన నగరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రష్యా ఈ దాడులకు తెగబడుతోంది. దీంతో జపొరిజియాలో రెండు అపార్ట్​మెంట్లు ధ్వంసమయ్యాయని, శిథిలాల కింది నుంచి  శుక్రవారం 11 డెడ్​బాడీలను వెలికితీశామని ఆ ఏరియా గవర్నర్​ ఒలెక్సాండర్​ స్తారుఖ్​ చెప్పారు. అటాక్ జరిగిన ప్రాంతం నుంచి 21 మందిని రక్షించామని చెప్పారు.

అణ్వాయుధాలపై పుతిన్ జోక్ చేయట్లే: బైడెన్

ఉక్రెయిన్​పై అణ్వాయుధ ప్రయోగం విషయంలో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ జోక్ చేయట్లేదని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. తమ భూభాగాలను కాపాడుకునే ప్రయత్నంలో అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగించడానికీ వెనుకాడబోమని పుతిన్​ ముందునుంచీ చెబుతున్నారని గుర్తుచేశారు. డెమోక్రటిక్ సెనెటోరియల్ క్యాంపెయిన్ కమిటీకి నిర్వహించిన ఫండ్ రైజర్ కార్యక్రమంలో బైడెన్​ ఈ కామెంట్స్​ చేశారు.