ఉక్రెయిన్ అతలాకుతలం

ఉక్రెయిన్ అతలాకుతలం

ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. ఇటు యుద్ధం.. అటు వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గుట్టల కొద్ది శవాల మధ్య అక్కడ కలరా విజృంభిస్తోంది. శవాలు కుళ్లిపోవడంతో నీరు, గాలి కలుషితం అయ్యింది. వేల మంది ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. ఓడరేవు నగరం మరియుపోల్ ప్రజలు తీవ్ర వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వెంటనే నగరాన్ని విడిచిపెట్టి వెళ్లాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మరియుపోల్ రష్యా ఆధీనంలో ఉంది. కొన్ని చోట్ల పౌరులకు కనీసం శుభ్రమైన తాగునీరు లభించని దుస్థితి నెలకొంది. నగరంలో వైద్యసదుపాయాలు ఇప్పటికే కుప్పకూలాయి. ఖేర్సన్ లోనూ ఔషధాలకు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. 

శవాలు వీధుల్లో కుళ్లిపోతున్నాయ్..వాటిని తొలగించే పారిశుద్ధ్య వ్యవస్థ విచ్చిన్నమైంది. దీంతో విరేచనాలు, కలరా వ్యాప్తి జరుగుతోంది. మరియుపోల్ లో ఉన్న వారిని తరలించేందుకు ఐక్యరాజ్యసమితి మానవతా కారిడార్ లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక ఉక్రెయిన్ నగరాలను ఆక్రమించుకున్న రష్యా.. అక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో తీవ్ర ఇబ్బంది పడుతోంది. పౌరులకు సురక్షిత మంచినీరు అందించే పరిస్థితుల్లో ప్రస్తుతం రష్యా లేదు. మే నుంచి మరియుపోల్, ఖేర్సన్ లో కలరా కేసులునమోదవుతున్నాయి.