ఈ శతాబ్దాన్నిఇండియా డిసైడ్ చేస్తది

ఈ శతాబ్దాన్నిఇండియా డిసైడ్ చేస్తది

కీవ్​: ఈ శతాబ్దపు తలరాతను డిసైడ్ చేసే దేశాల్లో ఇండియా కూడా ఒకటని ఉక్రెయిన్ యంగెస్ట్ ఎంపీ స్వియటోస్లావ్ యురాష్​అన్నారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీతో మాట్లాడినందుకు ప్రధాని మోడీకి ఆయన ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ లో థ్యాంక్స్ చెప్పారు. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్​లో అవస్థలు పడుతున్న వాళ్ల కోసం మానవత్వంతో సాయం చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇండియా, రష్యా మధ్య గట్టి స్ట్రాటజిక్ పార్ట్​నర్​షిప్​ ఉందని, కానీ ఇప్పుడు రష్యా తీరుపై ఇండియా మళ్లీ ఆలోచన చేసుకోవాలని కోరారు. గత 20 ఏండ్లుగా పుతిన్ హయాంలో రష్యా తీరు పూర్తి గా మారిపోయిందన్న విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. రష్యా యుద్ధం చేసినంతకాలం తాము పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టంచేశారు.