
కటక్: అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ నాలుగో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. శనివారం థర్డ్ ప్లేస్ కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ఒడిశా జాగర్‌నాట్స్ 32–24తో యోధాస్‌ను ఓడించింది. స్టార్టింగ్‌లో అటాకింగ్ గేమ్ ఆడిన యోధాస్ ప్లేయర్లు స్కై డైవ్‌లో 10 పాయింట్లు సాధించారు. కానీ టచ్ (6), పోల్ డైవ్ (4)లో నిరాశపర్చారు. 4 బోనస్ పాయింట్లు సాధించినా లాభం జరగలేదు. ఒడిశా 16 టచ్ పాయింట్లతో ఆధిపత్యం చూపెట్టింది. స్కై డైవ్‌లో 6, పోల్ డైవ్‌లో 4, బోనస్‌లో 6 పాయింట్లు సాధించారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో గుజరాత్ జెయింట్స్ 31–26తో చెన్నై క్విక్‌గన్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.