అల్ట్రా లగ్జరీ హోమ్స్​ సేల్స్​ జోష్​

అల్ట్రా లగ్జరీ హోమ్స్​ సేల్స్​ జోష్​

దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో అల్ట్రా లగ్జరీ హోమ్స్​ సేల్స్​ మూడు రెట్లు ఎగసినట్లు ఎనరాక్​ వెల్లడించింది. రూ. 40 కోట్ల విలువ మించిన ఇండ్లను అల్ట్రా లగ్జరీ హోమ్స్​గా పరిగణిస్తారు. ఇలాంటి అల్ట్రా లగ్జరీ హోమ్స్​ అమ్మకాలు ఈ ఏడాది  రూ. 4,063 కోట్లకు చేరినట్లు ఎనరాక్​ తెలిపింది. ఢిల్లీ–ఎన్​సీఆర్​, ముంబై –ఎంఎంఆర్​, చెన్నై, కోల్​కతా, బెంగళూరు,  హైదరాబాద్​, పుణె సిటీలలో కలిపి 58 అల్ట్రా లగ్జరీ హోమ్స్​ అమ్ముడయినట్లు పేర్కొంది. 

2022 కేలండర్​ ఇయర్​ మొత్తం మీద చూస్తే రూ. 1,170 కోట్ల విలువైన 13 అల్ట్రా లగ్జరీ హోమ్స్​ మాత్రమే అమ్ముడయ్యాయని రియల్​ ఎస్టేట్​ కన్సల్టింగ్​ కంపెనీ  ఎనరాక్​ వివరించింది. కరోనా తర్వాత లగ్జరీ, అల్ట్రా లగ్జరీ హోమ్స్​ సెగ్మెంట్స్​లో అమ్మకాలు బాగా పుంజుకున్నట్లు ఎనరాక్​ చైర్మన్​ అనూజ్​ పూరి చెప్పారు. హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​, అల్ట్రా హైనెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​ ఇలాంటి ఇండ్లను కొనుగోలుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు.  జియో పొలిటికల్​ టెన్షన్లు పెరుగుతాయనే అంచనాలతో హై నెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​లో చాలా మంది స్టాక్​మార్కెట్​ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, ఆ డబ్బుతో ఇండ్లను కొంటున్నట్లు వివరించారు. 

ఏడు సిటీలలో కలిపి 58 అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలు అమ్ముడైతే, ఇందులో ఒక్క ముంబై సిటీలోనే 63 ప్రాపర్టీలు ఉండటం విశేషం. ఢిల్లీ–ఎన్​సీఆర్​లో 4, హైదరాబాద్​లోని జూబిలీహిల్స్​లో రూ. 40 కోట్ల విలువైన ఒకే ఒక్క రెసిడెన్షియల్​ డీల్​ జరిగినట్లు పేర్కొన్నారు. ముంబై సిటీలో జరిగిన డీల్స్​లో మూడు డీల్స్​ఒక్కొక్కటి  రూ. 200 కోట్ల పైబడినవేనని, ఈ మూడు డీల్స్​ను ఎనరాక్​ కన్సల్టింగే నిర్వహించిందని పూరి వివరించారు.