చదువుకోని.. చదువురాని రాజకీయ నేతలకు ఓట్లు వేయొద్దు..

చదువుకోని.. చదువురాని రాజకీయ నేతలకు ఓట్లు వేయొద్దు..

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లోగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో  బీజేపీ సహా అన్ని పార్టీలు ఎన్నికలపై సీరియస్ గా దృష్టి సారించాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తాయిలాలు, పథకాల ఆశ చూపుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఎన్నికలు, ఓట్లు, అభ్యర్థులపై ఓ ఉపాధ్యాయుడి ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

54 సెకన్ల వీడియోలో అనాకాడెమీకి చెందిన  ఉపాధ్యాయుడు కరణ్ సంగ్వాన్  రాబోయే ఎన్నికల గురించి విద్యార్థులకు పలు సూచనలు చేశాడు. ఇందులో భాగంగా ఎన్నికల్లో 'నిరక్షరాస్యులకు ఓటు వేయొద్దన్నాడు. అంతేకాదు పేర్లు మార్చుకునే రాజకీయ నాయకులకు కూడా ఓటు వేయొద్దని విజ్ణప్తి చేశాడు. ఓటు వేసే ముందు ఆలోచించాలని..అక్షరాస్యత గల వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించాడు. నిరక్షరాస్యులకు ఓటేస్తే ఇబ్బందుల్లో పడతారని..కాబట్టి..ఓటు ఎవరికి వేయాలో ముందే నిర్ణయించుకోవాలని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. 

మోదీని ఉద్దేశించి అన్నాడా..?

ఉపాధ్యాయుడు కరణ్ సంగ్వాన్ ..ప్రధాని మోదీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. అనాకాడెమీ మోదీ వ్యతిరేక ఎజెండాతో పనిచేస్తోందని మండిపడుతున్నారు. మోదీపై ధ్వేషం పెంచుకుని..ఆయనకు వ్యతిరేకంగా వీడియోలు రికార్డు చేస్తూ..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మోదీ అంటే ఇష్టం లేకుండా వ్యతిరేకించాలని..కానీ విద్య ముసుగులో సొంత ఎజెండాను అమలు చేయవద్దని  అభయ్ ప్రతాప్ సింగ్ అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. 

ఉప్యాధ్యాయుడు కరణ్ సంగ్వాన్..కరణ్ యూట్యూబ్ ఛానెల్, లీగల్ పాత్ షాలా వ్యవస్థాపకుడు. ఇతడు ఎల్ఎల్ఎం పూర్తి చేశాడు. క్రిమినల్ చట్టాలపై ఇతనికి ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాదు న్యాయవ్యవస్థలో మాస్టర్స్ కూడా చఏశాడు. 2020లో అనాకాడెమీలో చేరాడు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్  సిమ్లాలో నేషనల్ లా యూనివర్సిటీలో చదివాడు.