
హైదరాబాద్, వెలుగు:నేషనల్ మినీ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో సూపర్‌గా ఆడుతున్న తెలంగాణ టీమ్స్ ఫైనల్‌కు చేరుకున్నాయి. నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అండర్–-12 బాయ్స్, గర్ల్స్ కేటగిరీల్లో ఆతిథ్య తెలంగాణ ట్రోఫీలకు అడుగు దూరంలో నిలిచింది.
గర్ల్స్ టీమ్ సెమీఫైనల్లో 17-–11తో తమిళనాడుపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో హర్యానా 18--–4తో ఢిల్లీపై నెగ్గింది. బాయ్స్ సెమీఫైనల్లో తెలంగాణ 19-–5తో ఉత్తరాఖండ్‌ను చిత్తుగా ఓడించింది. మరో సెమీస్‌లో జార్ఖండ్‌పై గెలిచిన ఢిల్లీతో ఆతిథ్య జట్టు ఫైనల్లో తలపడనుంది.