ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారు?

ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారు?

న్యూఢిల్లీ: ఇండో-చైనా బార్డర్ వివాదంపై పలుమార్లు కేంద్రాన్ని ప్రశ్నించిన విపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చైనాతో సరిహద్దు వివాదం మొదలైనప్పటి నుంచి జరిగిన పలు కీలక పరిణామాలు, మోడీ స్పందన, ప్రభుత్వ ప్రకటనను వరుస క్రమంలో రాహుల్ ట్వీట్‌‌ షేర్ చేశారు. సదరు వరుస క్రమాన్ని అర్థం చేసుకోవాలని కోరిన రాహుల్.. ఈ వివాదం విషయంలో ప్రధాని మోడీ ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. ‘వరుస క్రమాన్ని అర్థం చేసుకోండి: సరిహద్దులను ఎవరూ అతిక్రమించలేదని ప్రధాని మోడీ చెప్పారు. ఆ తర్వాత చైనాకు చెందిన కంపెనీల నుంచి భారీ మొత్తంలో లోన్ తీసుకున్నారు. అనంతరం డిఫెన్స్ మినిస్టర్ చైనా మన భూభాగాన్ని స్వాధీనం చేసుకుందన్నారు. ఇప్పుడు ఎంవోఎస్ హోమ్ (ప్రభుత్వం) ఎలాంటి అతిక్రమణలు జరగలేదని చెబుతోంది. మరి మోడీ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీతో ఉన్నట్లా? లేదా చైనాతో ఉన్నట్లా? మోడీజీ ఎందుకు భయపడుతున్నారు?’ అని రాహుల్ ట్వీట్ చేశారు.