కరోనా నుంచి కోలుకున్న మాఫియా డాన్ చోటా రాజన్

కరోనా నుంచి కోలుకున్న మాఫియా డాన్ చోటా రాజన్

కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడ్డ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్  కోలుకున్నాడు. ఏప్రిల్ 22న చోటా రాజన్ కు ఢిల్లీలోని తీహార్ జైల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.దీంతో ట్రీట్ మెంట్ కోసం చోటా రాజన్ ను ఏప్రిల్ 24న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు పోలీసు ఉన్నతాధికారులు. లేటెస్టుగా టెస్టు చేయడంతో చోటా రాజన్ కు కరోనా నెగెటివ్ వచ్చింది. కరోనా నుంచి కోలుకోవడంతో అతడిని తిరిగి తీహార్ జైలుకు తీసుకువచ్చినట్టు పోలీసులు తెలిపారు.