
దేశ ప్రయోజనాలను కాపాడడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్న ధైర్యం, డెడికేషన్‌తో అంతర్జాతీయంగా ఇండియా ఎఫిషియంట్ కంట్రీగా గుర్తింపు పొందుతోంది. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి నేటికి ఏడాది అవుతోంది. ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ… మోడీ 2.0 మొదటి సంవత్సరం సాహసోపేతంగా గడిచింది. ఎన్డీయే ఫస్ట్ టర్మ్ పాలనలో రిఫామ్స్, హార్డ్ వర్క్, మార్పులు తేవడం మీద ఫోకస్ చేశాం. జామ్(జన్‌ధన్, ఆధార్, మొబైల్) త్రయాన్ని ఉపయోగించి ఫైనాన్షియల్‌గా స్ట్రెంతెన్ చేశాం. స్వచ్ఛ భారత్‌తో శుభ్రత పెంపొందించడం… ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్యసేవలను అందించడంలో చాలా కృషి చేశాం. దీంతో మోడీ సర్కార్‌పై ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాలను నమ్మకుండా 2019లో ప్రజలు భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించారు.
ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్ నిషేధించడం, పొరుగు దేశాల్లో హింసకు గురయ్యే మైనారిటీలకు పౌరసత్వం ఇచ్చే సీఏఏ వంటి పలు చరిత్రాత్మకమైన నిర్ణయాలు ఈ ఏడాది తీసుకుంది. ఆర్థిక రంగంలో అనేక విజయాలు సాధించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇండియా కేంద్రంగా మారింది. ఈజీగా బిజినెస్ చేసుకునే విషయానికి మన దేశంలో 2014లో 142వ స్థానంలో వుండేది. 2019 నాటికి 63కు చేరింది. మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశంగా అవతరించింది.
కరోనా కట్టడిలో ప్రపంచ దేశాలకంటే మెరుగు
కొవిడ్ 19 రూపంలో పెద్ద సవాలు వచ్చిపడింది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రధాని మోడీ అసాధారణమైన ధైర్యాన్ని, డెడికేషన్‌ను చూపుతున్నారు. దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో స్ప్రెడింగ్ ఆపడానికి మన దగ్గరున్న ఏకైక ఆయుధం లాక్ డౌన్ మాత్రమే. కరోనా కేసులు, మరణాల్లో ఒక కొట్టొచ్చే తేడా ఏమిటంటే ప్రపంచంలోని 15 ప్రధాన దేశాలను తీసుకుంటే ( చైనాను మినహాయించి) వాటి జనాభా అంతా కలిపి 142 కోట్లు ఉంటుంది. ఇండియా జనాభా 137 కోట్లు. ఆ 15 దేశాల్లో మృతుల సంఖ్య 3.07 లక్షలుంటే మన దగ్గర సంఖ్య 4, 534 మాత్రమే. అట్లనే రికవరీల సంఖ్య మనదగ్గర ఎక్కువ. లాక్ డౌన్ విధించిన మొదట్లో పేదలకు సాయం కింద 1.70 లక్షల కోట్ల రూపాయలను ప్రకటించడమైంది. 80 కోట్ల మందికి లబ్ధిచేకూరేలా మూడు నెలలపాటు ఫ్రీ రేషన్ ప్రకటించింది. 20 కోట్ల మంది మహిళల జన్‌ధన్ అకౌంట్లకు నేరుగా 52,606 కోట్ల రూపాయలు జమ చేయడమైంది. దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు ఆత్మ నిర్భర్ భారత్ పేరు మీద 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో 5.94 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ మందికి ఉద్యోగాలను కల్పిస్తున్న చిన్న మధ్య తరహా పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, పవర్ డిస్ట్రిబ్యూషన్ రంగాల కోసం కేటాయించింది. ప్యాకేజీ ఎక్కువ పరిశ్రమలకు వర్తించడం కోసంగాను చిన్న మధ్య తరహా పరిశ్రమల నిర్వచనాన్ని మార్చింది. రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వలస కార్మికులు, పట్టణ పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు వర్తించే విధంగా రూ. 3.16 లక్షల కోట్ల రూపాయాలను కేటాయించింది. పట్టణ, గ్రామీణ పేదలు, వలస కూలీల కోసం రాబోయే రెండు నెలలపాటు రేషన్ ద్వారా ఉచిత ఆహార ధాన్యాలను ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. స్ట్రీట్ వెండర్లకు రూ.10 వేల వరకు ఈజీగా లోన్ దొరికేట్లు చేసింది. ఉపాధి హామీ స్కీమ్‌కు అదనంగా రూ.40 వేల కోట్లను కేటాయించింది. పొలాల వద్దనే వ్యవసాయ ఉత్పత్తులు కొనడానికి వీలుగా రూ.1.63 లక్షల కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తోంది. దేశంలో ఎవరైనా.. ఎక్కడైనా వ్యవసాయ ఉత్పత్తులు అమ్మేలా.. కొనేలా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రైతుల పంటలకు మంచి రేటువస్తుంది.
ఉపాధి హామీ పథకానికి ఎక్స్‌ట్రా ఫండ్స్, 3,500 వరకూ శ్రామిక్ రైళ్లు, ఫ్రీ రేషన్, హెల్త్ టెస్ట్‌లు, రాష్ట్రాలకు మద్దతుగా క్వారంటైన్ ఫెసిలిటీస్ కల్పించడం ద్వారా కార్మికుల సమస్య తీర్చేందుకు కేంద్రం పని చేస్తోంది. కరోనా కారణంగా గతంలో లేని రీతిలో దుర్భరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రపంచంలోని అనేక దేశాలకంటే మిన్నగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రాల సహకారంతో ఈ మహమ్మారి తెచ్చిన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాం. ప్రధాని ధైర్యం, పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఈ సంక్షోభాన్ని అధిగమిస్తున్నాం. ఈ సవాల్ కారణంగా రానున్న రోజుల్లో దేశానికి మంచి అపార్చునిటీస్ వస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇండిమా సామర్థ్యం అందరికీ తెలిసే రోజు వచ్చింది.
లబ్ధిదారుల అకౌంట్లలో రూ.11 లక్షల కోట్లు
మోడీ 2.0 ఈ ఏడాది పేదలు, రైతుల కోసం అనేక రిఫామ్స్ తెచ్చింది. అర్హుడైన ప్రతి రైతుకు పీఎం కిసాన్ యోజన ద్వారా ఏటా రూ.6 వేల సాయం అందిస్తోంది. రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులకు, సెల్ఫ్ ఎంప్లాయిస్‌కు సోషల్ సెక్యూరిటీ కల్పించేందుకు స్పెషల్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. దేశంలోని మారుమూల పల్లెలకు కరెంటు, 8 కోట్ల ఫ్యామిలీలకు సబ్సీడీ ఎల్పీజీ కనెక్షన్లను ఇచ్చింది. 435 స్కీమ్‌ల ద్వారా రూ.11 లక్షల కోట్లను లబ్ధిదారుల అకౌంట్లలో వేసింది. నేరుగా ఖాతాల్లో డబ్బు వేయడం వల్ల దేశానికి రూ.1.70 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఇవి గతంలో మధ్య దళారుల, మోసగాళ్ల జేబుల్లోకి పోయేవి.
రిఫామ్స్‌తో వెలుగులోకి టాలెంట్
కరోనా ఆపద టైమ్‌లో ఇండియన్స్‌లో దాగిన టాలెంట్‌ను బయటకు తీసేలా ప్రధాని మోడీ పలు రిఫామ్స్ తీసుకొస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ఉద్యమం బలంగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. బొగ్గు, మైనింగ్ రంగాల్లో రిఫామ్స్ తెచ్చారు. రక్షణరంగ ఉత్పత్తుల్లో దేశీయత ఉండేలా చూస్తున్నారు. విమానరంగ నిర్వహణకు దేశంలో సెంటర్ పాయింట్‌గా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్‌లో రూ.50 వేల కోట్ల విలువైన ఇన్సెంటివ్‌లు ప్రకటించారు. దీంతో ఈ రంగాల్లో తయారీ, ఉద్యోగ కల్పన పెరుగుతుంది. కరోనా వల్ల పరిశోధనలు కూడా పెరిగాయి. ఆరోగ్య సేతు వంటివి వైరస్ కట్టడికి ఉపయోగపడుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ మీద కొత్తకొత్త ఇండియా ఉత్పత్తులు రెడీ అవుతున్నాయి. ఇంటి నుంచే పని వల్ల డిజిటల్ ఎడ్యుకేషన్‌కు ఇపార్టెన్స్ పెరిగి అందరికి ఉపయోగపడే ఆపర్చునిటీస్ కనుగొంటున్నారు. ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టంతో ఇండియా పోస్ట్ విభాగం 1, 675 కోట్ల రూపాయల పేమెంట్స్ చేసింది. ఇండియా పోస్ట్ చేసిన 92.81 లక్షల ట్రాన్జాక్షన్స్‌తో కన్జుమర్స్ ఏటిఎం, బ్యాంకులకు వెళ్లడం తగ్గింది. వలస కార్మికుల సమస్యను తొలగించడానికి అందరమూ కలిసికట్టుగా కృషి చేయాలి.