మంత్రులకు నిరుద్యోగుల నిరసన సెగ

V6 Velugu Posted on Jul 22, 2021

  • రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రం వద్ద ఘటన

రంగారెడ్డి జిల్లా: మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డిలకు నిరుద్యోగుల నిరసన సెగ తగిలింది. కొందుర్గు మండల కేంద్రం ప్రాంతంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సబితా ఇంద్రా రెడ్డి కాన్వాయ్ ని బీజేవైఎం నాయకులు నిరుద్యోగులతో కలసి అడ్డగించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు. వర్షాలకు దెబ్బతిని అధ్వాన్నంగా మారిన రోడ్లను వచ్చి చూడమంటూ కోరారు. నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు ను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీజెవైయం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

Tagged BJYM Protest, , rangareddy district today, Kondurgu Mandal, Unemployees agitation, dammage of roads, Lakshmidevi project construction

Latest Videos

Subscribe Now

More News