ఈ ఎన్నికల్లో గమ్మత్తులెన్నో

ఈ ఎన్నికల్లో గమ్మత్తులెన్నో
  • ఫస్ట్‌ టైం వీవీ ప్యాట్ల వినియోగం
  • ఎక్కువ మంది అభ్యర్థుల పోటీతో నిజామాబాద్‌ ఎన్నిక
  • జనం లేక కేసీఆర్‌ సభ క్యాన్సిల్‌ ..?
  • వివాదాస్పదంగా పోలింగ్‌ పెం పు శాతం
  • ఫలితాలకు ఎక్కువ గడువుతో అభ్యర్థుల టెన్షన్‌

రాష్ట్రంలో లోక్‌ సభ ఎన్నికలు ప్రశాంతంగానేముగిశాయి. ఊహించని స్థాయిలో రిజల్ట్స్వచ్చాయి. ఇటు టీఆర్ ఎస్ కు సీట్లు తగ్గిపోగా,కాంగ్రెస్ మూడు సీట్లతో గట్టెక్కింది. బీజేపీ అనూ-హ్యం గా నాలుగు సీట్లు గెల్చుకుం ది. అయితేనిజామాబాద్ లో పెద్ద సంఖ్యలో రైతులు పోటీలోదిగడం, ప్రచారంలో సిత్రాలు, పోలింగ్ శాతం,ఈవీఎంల తరలింపు, వీవీ ప్యాట్ల లెక్కింపు వంటిఅంశా లెన్నో ఆసక్తికరంగా నిలిచా యి. అలాంటికొన్నిం టిని గుర్తు చేసుకుంటే..

నిజామాబాద్‌ లో 185 మంది పోటీ

185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నిజామా-బాద్‌‌‌‌‌‌‌‌ సీటు ఈసారి ఎలక్షన్లలో దేశవ్యాప్తంగాచర్చనీయాంశంగా నిలి చింది. పసుపు బోర్డుఏర్పాటు, మద్దతు ధరల డిమాండ్ తో 175రైతులు ఎన్నికల్లో పోటీ చేశారు . దీంతో ఎన్నికలనిర్వహణ ఈసీకి సవాల్‌‌‌‌‌‌‌‌గా మారింది. అయినావిజయవంతంగా ఎలక్షన్ నిర్వహించారు . 185మంది అభ్యర్థులు ఉండటంతో ఓట్లు వేయడానికిఎల్‌‌‌‌‌‌‌‌ ఆకారంలో ఈవీఎంలను అమర్చారు. ఓట్లలెక్కి పులోనూ 36 చొప్పున టేబుళ్లు ఏర్పాటుచేయాల్ సి వచ్చిం ది. ఇక్కడ ఎవరూ ఊహించనిరీతిలో టీఆర్ ఎస్ సిట్టిం గ్ ఎంపీ, సీఎం కేసీఆర్బిడ్డ కవిత పరాజయం పాలయ్యారు.

పెద్దోళ్లు ప్రచారానికొచ్చిన్రు

రాష్ట్రంలో మొదటి విడతలోనే ఎన్నికలు జరగడం-తో ఆయా పార్టీల అగ్రనేతలు ఇక్కడ దృష్టిపెట్టారు .బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ రెండుసార్లుప్రచారంలో పాల్గొన్నారు . కమల దళపతి అమిత్‌షా శంషాబాద్ సభకు హాజరయ్యారు . అయితేకరీంనగర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన సభకు వస్తానని చెప్పి,చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు . ఇక కేంద్రమంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌‌‌‌‌‌‌‌, సుష్మా స్వరాజ్‌ , పురు-షోత్తం రూపాలా తోపాటు యూపీ సీఎం యోగి ఆది-త్యనాథ్‌ తదితరులు ప్రచారం చేశారు . కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 1న ఒకే రోజు మూడు సభల్లో పాల్గొన్నారు . బీఎస్పీఅధినేత మాయావతి ఎల్బీనగర్ సభలో పాల్గొన్నా -రు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నుంచి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ 14 బహిరంగసభల్లో , వర ్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రోడ్‌‌‌‌‌‌‌‌ షోలు,ర్యాలీ లు, సభల్లో పాల్గొన్నారు .

జనం లేక కేసీఆర్‌ సభ క్యాన్సిల్‌ !

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ లోక్‌ సభ పరిధిలోని ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌లోనిర్వహించతలపెట్టిన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సభ జనం లేకక్యా న్సిల్‌‌‌‌‌‌‌‌ అయింది. సీఎం ఆరోగ్యం బాగాలేదం-టూ ఆ సభకు వెళ్లలేదు. జనాలు లేకపోవడంతోసీఎం రాలేదని, సభను మధ్యలోనే ముగించా రనిప్రచారం జరిగిం ది. అయితే రాష్ట్రంలో జరిగినఅన్ని ఎలక్షన్ల సభల్లోనూ జనాలు పెద్దగా కనిపిం -చలేదు. విపరీతమైన ఎండలకు తోడు, కేవలంలోక్​సభ ఎన్నికలు కావడంతో జనంలో ఆసక్తికనిపిం చలేదు.

వివాదాస్పదంగా పోలింగ్‌ శాతం

లోక్‌ సభ ఎన్నికల్లో చివరి గంటలో భారీగా పోలింగ్‌‌‌‌‌‌‌‌ శాతం నమోదైనట్టు చూపడం వివాదాస్పదమైం-ది. ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల వరకు60.57 శాతం పోలింగ్ రికార్డయినట్టు ప్రకటిం-చగా.. మరునాడు ఈసీ విడుదల చేసిన లెక్కలప్రకారం 62. 69 శాతం పోలింగ్‌‌‌‌‌‌‌‌ నమోదైంది.ఇందు లోనూ కొన్ని లోక్​సభ సీట్ల పరిధిలో పెరు-గుదల శాతం ఎక్కువగా ఉంది. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లోఅయితే ఏకంగా 14.13 శాతం ఎక్కువైంది. మహ-బూబాబాద్‌‌‌‌‌‌‌‌లో 8.89శాతం, నల్లగొండలో 8, సికిం-ద్రాబాద్‌‌‌‌‌‌‌‌లో 7.06, ఖమ్మం లో 7.32, పెద్దపల్లిలో6.19శాతం చొప్పున పోలింగ్‌‌‌‌‌‌‌‌ పెరిగింది. అయితేతొలుత అంచనాలు చెప్పామని, మరునాడులెక్కలు వేసి చెప్పామని ఎలక్షన్ అధికారు లు సమ-ర్థిం చుకున్నారు .

ఫస్ట్‌ టైం వీవీ ప్యాట్ల లెక్కింపు

లోక్‌ సభ ఎన్నికల్లో తొలిసా రి వీవీ ప్యాట్లను లెక్కిం-చారు. ఓటర్లు తాము ఎవరికి ఓటేశామో తెలుసు-కోవడానికి వీవీ ప్యాట్లను తెచ్చారు. అయినా ఈవీ-ఎంలపై అనుమానాలు ఉన్నాయంటూ కొందరుసుప్రీంకోర్టు వెళ్లారు . దీంతో ప్రతీ అసెంబ్లీ నియోజ-కవర్గం లో ఐదు చొప్పున వీవీ ప్యాట్లలోని స్లిప్పులనులెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈవీఎంల తరలింపు గందరగోళం

రాష్ట్రంలో పలుచోట్ల ఈవీఎంల తరలింపు గంద-రగోళం ఏర్పడింది. జగిత్యా ల జిల్లాలో ఓ ఆటోలోఈవీఎంలు తరలించడంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ వార్తలు వచ్చాయి. దీంతో తొమ్మిది మందిజర్నలిస్టు లపై పోలీసులు కేసులు పెట్టారు . ఘట్‌ కే-సర్‌‌‌‌‌‌‌‌ వద్ద ఓ టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్త ఈవీఎంలను భద్ర-పర్చిన స్ట్ రాంగ్‌‌‌‌‌‌‌‌రూమ్‌ లోకి వెళ్లి సెల్ఫీ తీసుకోవడంపైసందేహాలు వ్యక్తమయ్యా యి.

అభ్యర్థుల్లో టెన్షన్‌ .. టెన్షన్‌ ..

దేశంలో మొత్తం ఏడు విడతల్లో ఎలక్షన్లు నిర్వ-హించారు. రాష్ట్రంలో మాత్రం తొలి విడత అయినఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 11వ తేదీనే పోలింగ్ జరిగింది. ఫలితాలుమే 23న విడుదలయ్యా యి. అంటే సుమారు నెలపదిహేను రోజులు రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ కోసం ఎదురుచూడాల్సివచ్చింది. దీంతో అభ్యర్థులు టెన్షన్ తో గడిపారు.

ఊహించని తీర్పు

రాష్ట్రంలో ఎవరూ ఊహించని విభిన్నతీర్పును తెలంగాణ ప్రజలు ఇచ్చారు.మొదటి నుంచి టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీనే ఎక్కువసీట్లు గెలుచుకుంటుందని సర్వే లు వెల్ల-డించా యి. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తాము 16 స్థా నాల్లోగెలుస్తామని చెప్పుకొంది. కానీ తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. ఏకంగా సీఎం బిడ్డ కవిత, సన్నిహితుడు వినోద్ ఓడిపోయారు .ఇక బీజేపీ నాలుగు స్థా నాలు గెలుచుకుంది.కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ మూడు సీట్లతో తామింకా ఉన్నామ-నే సంకేతం ఇచ్చిం ది. మొత్తంగా ఎన్నికలుప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా అవాంఛ-నీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.