
ములుగు, వెలుగు: ములుగు మండలంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో శుక్రవారం సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహం విద్యార్థులకు ప్రేరణ ఇస్తుందని వీసీ రాజిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్, అధికారులు, లెక్చరర్లు చిన్న నాయక్, లక్ష్మీనారాయణ, సురేశ్‌కుమార్, రాజశేఖర్, శ్రీనివాసన్, విజయ, నాగేశ్వర్ రెడ్డి, రమేశ్, నాగిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.