
దుబ్బాక, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచి, వాటికి పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అబ్జర్వర్కిషన్ తెలిపారు. శుక్రవారం దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈవో రవీందర్ రెడ్డితో కలిసి సందర్శించారు. విద్యార్థులు, లెక్చరర్లతో మాట్లాడారు. కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం రూ. 56 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఇందులో సిద్దిపేట జిల్లాకు రూ.2 కోట్లకు పైగా కేటాయించినట్లు పేర్కొన్నారు.
ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని సూచించారు. నీట్, ఇంజినీరింగ్, ఐఐటీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి ఆన్ లైన్ కోచింగ్సంస్థలతో ఇంటర్‌బోర్డు ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. విద్యార్థులు ప్రైవేట్కళాశాలల ప్రచారానికి ఆకర్షితులై మోసపోతుంటారని, ప్రభుత్వ కాలేజీల్లో చేరి, సర్కారు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, లెక్చరర్లు పాల్గొన్నారు.