
- రూ.15 లక్షల నగదు బహుమతి
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ఏరియా ఆస్పత్రి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ‘కాయకల్ప అవార్డు’ గెలుచుకుంది. 2024–25 సంవత్సరానికి గాను కేంద్ర ఆరోగ్య శాఖ అందజేసింది. దీనితో పాటు రూ.15 లక్షల నగదు బహుమతి కూడా మంజూరైంది. కొన్ని నెలల క్రితం ప్రత్యేక బృందాలు ఆసుపత్రిని సందర్శించి అందిస్తున్న వైద్యం, శుభ్రత, నిర్వహణ, విభాగాల పనితీరు, రోగుల స్పందన మొదలైన అంశాలపై నివేదిక రూపొందించారు.
ఇంటర్నల్ అసెస్మెంట్, పియర్ అసెస్మెంట్, రాష్ట్రస్థాయి ఎక్స్టర్నల్ అసెస్మెంట్‌ద్వారా తుది స్కోరును నిర్ణయించగా.. అత్యుత్తమంగా 92.6 శాతం స్కోరు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకుంది. అవార్డు రావడం పట్ల సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు.