ఇసుక నిల్వలను వెరిఫై చేసుకోండి : కలెక్టర్ కె.హైమావతి

ఇసుక నిల్వలను వెరిఫై చేసుకోండి :  కలెక్టర్ కె.హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: మండలాల్లో ఎక్కడ ఇసుక నిల్వలు ఉన్నాయో వెరిఫై చేసుకొని, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక పంపిణీకి టోకెన్స్ ఇవ్వాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని మోయతుమ్మెద, కూడవెల్లి వాగులతో పాటు వాటి ఉప కాల్వల్లో ఇసుక నిల్వలు ఉన్న మండలాల్లో ఎలాంటి సమస్య లేదన్నారు. మిగతా మండలాల్లోనూ వాగుల్లో ఇసుక తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇసుక కావాలని ఎంపీడీవోలు, తహసీల్దార్లకు రిక్వెస్ట్ పెట్టుకోవాలని, ఇసుక స్లిప్ లు తప్పనిసరిగా ట్రాక్టర్ వద్ద ఉండాలని, ఎక్కడైనా అక్రమంగా తరలిస్తే సీజ్ చేయాలని చెప్పారు. జిల్లాలో వనమహోత్సవం లక్ష్యాన్ని పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని పేర్కొన్నారు. 

పర్మిషన్​లేకుండా లీవ్​పెడితే చర్యలు 

కోహెడ, వెలుగు: పీహెచ్​సీల్లో మెడికల్​ఆఫీసర్లు, స్టాఫ్​ముందస్తు పర్మిషన్​లేకుండా లీవ్ పెడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్​హైమావతి హెచ్చరించారు. శుక్రవారం కోహెడ పీహెచ్​సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్​ఆఫీసర్, ముగ్గురు సిబ్బంది కేవలం లీవ్​లెటర్లు పెట్టి వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్​వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఔట్​పేషంట్లు, వారికిచ్చే మెడిసిన్​వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాలని చెప్పారు. అనంతరం శనిగరం హైస్కూల్​ను సందర్శించారు. స్టూడెంట్స్​తో తెలుగు పద్యాలు చెప్పించారు. 

తంగళ్లపల్లి, శనిగరంలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఇండ్లు మంజూరైనా కట్టుకోవడానికి సుముఖత లేని వారి నుంచి లెటర్​తీసుకొని, అర్హులైన ఇతరులకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటేడ్​ రెసిడెన్షియల్​స్కూల్​నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. చెట్లు, పొదలను తొలగించాలని సూచించారు. ఇతరుల కాబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి, హద్దులు ఏర్పాటు చేయాలని, కబ్జాదారులకు నోటీసులు ఇవ్వాలని చెప్పారు.

హెలిప్యాడ్​ స్థల పరిశీలన

గవర్నర్​ జిష్టుదేవ్​వర్మ త్వరలో కోహెడకు రానున్న నేపథ్యంలో కలెక్టర్ హైమావతి స్థానిక లక్ష్మి గార్డెన్​పక్కనున్న స్థలాన్ని హెలిప్యాడ్ కోసం పరిశీలించారు. పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులకు సూచించారు. ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్​అహ్మద్​ఖాన్, ఎంపీడీవో కృష్ణయ్య తదితరులున్నారు.