దళితులపై దాడి చేసినవారిని అరెస్ట్ చేయాలి : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వినతి.

దళితులపై దాడి చేసినవారిని అరెస్ట్ చేయాలి : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వినతి.

శివ్వంపేట, వెలుగు: బిజిలిపూర్ లో దళితులపై దాడి చేసినవారిని అరెస్ట్​ చేయాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, బాధితుడు నవీన్ కోరారు. శుక్రవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను హైదరాబాద్​లో కలిసి వినతి పత్రం అందజేశారు.

 పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చైర్మన్ తూప్రాన్ డీఎస్పీ నరేందర్ కు ఫోన్ చేసి, నిందితులను అరెస్ట్​ చేయాలని ఆదేశించారని శంకర్ తెలిపారు. నాయకులు చంద్రం, లక్ష్మణ్ ఉన్నారు.