జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జిల్లా అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అధిగమించి.. ప్రజలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ మెప్పుకోసం టీఆర్ఎస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో కలిసి భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు కిషన్ రెడ్డి.
కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ముఖ్యమంత్రి పదవి చెప్పుతో సమానమన్న కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హతలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు ఈటల. ఆర్టీసీ చార్జీల పెంపుపై బీజేపీ ఉద్యమిస్తుందన్నారు.
