
దేవరకద్ర, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు 20 రోజుల పసికందును రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకద్ర మండల కేంద్రలోని వెంగమాంబ దాబా ముందు ఉన్న బెంచిపై బుధవారం ఉదయం పసిపాప ఏడుస్తూ కనిపించడంతో దాబా యజమాని పోలీసులకు ఫోన్‌చేసి చెప్పాడు. ఎస్సై భగవంతరెడ్డి అక్కడికి చేరుకుని పాపను స్థానిక గవర్నమెంట్హాస్పిటల్కు తీసుకెళ్లి మెడికల్టెస్టులు చేయించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్కు అప్పగించడంతో ఆమె జిల్లా కేంద్రంలోని బాలభవన్‌కు తరలించింది.