కారును కాల్చేసిన దుండగులు.. డిక్కీలో డెడ్ బాడీ కలకలం

V6 Velugu Posted on Aug 10, 2021

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి శివారులో దారుణం జరిగింది. కారును కాల్చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. పూర్తిగా కాలిపోయిన కారు డిక్కీలో ఓ వ్యక్తి డెడ్ బాడీ ఉండటం కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారు ఇంజిన్ పై ఉన్న నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించారు పోలీసులు. మెదక్ పట్టణానికి చెందిన ధర్మకర్ శ్రీనివాస్ పేరుపై కారు రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు. 

Tagged car, fire, Medak, unidentified persons, veldurthy, Mangalaparthi

Latest Videos

Subscribe Now

More News