యూనిఫైడ్ పెన్షన్ స్కీంలో కీలక అంశాలివే...

యూనిఫైడ్ పెన్షన్ స్కీంలో కీలక అంశాలివే...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం రూపొందించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్​(యూపీఎస్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్​ కింద ఉద్యోగులకు బేసిక్ శాలరీలో 50 శాతం వరకూ పెన్షన్​గా  అందనుంది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకంతో లబ్ధి పొందనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

కేబినెట్ నిర్ణయాలను సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పీఎస్)లో చందాదారులుగా చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ పథకం 2025, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని, 2004, ఏప్రిల్ 1 తర్వాత ఎన్ పీఎస్ లో చేరిన ఉద్యోగులు అర్హులు అని వెల్లడించారు.

యూనిఫైడ్ పెన్షన్ స్కీం అంటే ఏంటి.... ఈ స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం:

అష్యూర్డ్ పెన్షన్:

యూపీఎస్ కింద కేంద్ర ఉద్యోగులకు అష్యూర్డ్ పెన్షన్, అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్, అష్యూర్డ్ మినిమమ్ పెన్షన్ లభించనున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ స్కీంలో చేరిన ఉద్యోగులకు రిటైర్మెంట్ కు ముందు చివరి12 నెలల్లో అందుకున్న జీతంలో యావరేజ్ బేసిక్ శాలరీలో 50 శాతం ఫుల్ పెన్షన్ వస్తుంది.

అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్:

కనీసం 25 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నవాళ్లకు ఫుల్ పెన్షన్ వర్తిస్తుంది, అలాగే 10 ఏండ్ల కనీస సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఆ మేరకు తగిన పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ పెన్షనర్ మరణిస్తే.. చివరిగా డ్రా చేసిన మొత్తంలో 60 శాతాన్ని కుటుంబానికి అందజేస్తారని చెప్పారు.

Also Read :- శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే ?

అష్యూర్డ్ మినిమమ్ పెన్షన్:

అలాగే కనీసం 10 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు కనీస పింఛన్ రూ. 10 వేలు చెల్లిస్తారన్నారు. ప్రస్తుత పెన్షన్ స్కీంలో ఉద్యోగుల వాటా 10 శాతం, కేంద్ర ప్రభుత్వ వాటా 14 శాతం ఉంటుందని, యూపీఎస్ లో కేంద్రం వాటాను 18 శాతానికి పెంచుతున్నామన్నారు. 

ఇన్ఫ్లేషన్ ఇండెక్స్: 

అష్యుర్డ్ పెన్షన్ మరియు అష్యుర్డ్ ఫ్యామిలీ పెన్షన్ రెండూ ద్రవ్యోల్బణ సూచికకు లోబడి ఉంటాయి. ద్రవ్యోల్బణ సూచికకు అనుగుణంగా పెన్షన్ ఉండేలా సవరణలు చేసినట్లు తెలుస్తోంది 

డియర్నెస్ రిలీఫ్:

ఉద్యోగులకు సేవలందిస్తున్నట్లే, యూపీఎస్ కింద పదవీ విరమణ పొందినవారు పారిశ్రామిక కార్మికులకు (AICPI-IW) ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా డియర్నెస్ రిలీఫ్ అందుకోనున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.

సూపర్‌ యాన్యుయేషన్‌పై ఏకమొత్తంలో చెల్లింపు:

గ్రాట్యుటీతో పాటుగా, ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో ఒకేసారి మొత్తం చెల్లింపును అందుకోనున్నారు. ఈ చెల్లింపు ఉద్యోగి యొక్క నెలవారీ వేతనాలలో 1/10వ వంతు (పే మరియు డియర్‌నెస్ అలవెన్స్‌తో సహా) పదవీ విరమణ తేదీ నాటికి, పూర్తి చేసిన ప్రతి ఆరు నెలల సర్వీస్‌కి. ఈ ఏకమొత్తం చెల్లింపు ద్వారా అష్యూర్డ్ పెన్షన్  మొత్తంపై ప్రభావం పడదు.