2029లోనూ ఎన్డీయే సర్కారే : కేంద్ర హోంమంత్రి అమిత్ షా

2029లోనూ ఎన్డీయే సర్కారే : కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఇండియా కూటమి ఎన్నికుట్రలు చేసిన 2029లోనూ మరోసారి ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్రహోంమంత్రి అమిత్ షా.  లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని  ప్రతిపక్షాలకు తెలియడం లేదన్నారు. కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉందని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్నారు. కానీ ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా మరోసారి అధికారంలోకి వస్తామన్నారు. చంఢీఘర్ లోని శివాలిక్ గార్డెన్ లో 24గంటల పాటు నీటి సరఫరా  చేసే ప్రాజెక్టును ప్రారంభించారు అమిత్ షా. ప్రాజెక్టు కోసం రూ.75కోట్లు ఖర్చు చేశామన్నారు కేంద్రహోంమంత్రి అమిత్ షా.

ALSO READ | తెలుగు యాత్రికులను రక్షించండి