- యూబీఐ మేనేజర్ మినాతి భోయ్
- బ్యాంక్ 107వ ఫౌండేషన్ డే
ముషీరాబాద్, వెలుగు: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మినాతి భోయ్ అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు అనధికారికంగా వచ్చే ఎటువంటి మెస్సేజ్లకు స్పందించద్దని సూచించారు. మంగళవారం రాంనగర్ బ్రాంచిలో బ్యాంక్107వ ఫౌండేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. యూనియన్ బ్యాంకు కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు ముందుంటామని తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉద్యోగులు కోటేశ్వర్ రావు, గురుశంకర్, గంగారత్నం, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కల్యాణ మండపంలో..
హైదరాబాద్సిటీ: దేశవ్యాప్తంగా అన్ని జోనల్కార్యాలయాల్లో మంగళవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107వ ఫౌండేషన్డే నిర్వహించినట్లు బ్యాంక్ తెలంగాణ ఎండీ, చీఫ్ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ ఆశిష్పాండే తెలిపారు. మంచిర్యాలతో కలిపి మరో 5 కొత్త బ్రాంచిలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మంచిర్యాల బ్రాంచిని డీఎఫ్ఎస్ సెక్రటరీ ఎం.నాగరాజు వర్చువల్గా ప్రారంభించారన్నారు. నగరంలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాబార్డ్చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్, ఆంధ్రాబ్యాంక్మాజీ ఎండీ.నారాయణన్ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్యాంక్స్టాఫ్తోపాటు కస్టమర్లు పాల్గొన్నారు.
