నారీ శక్తి.. ఇండియా ఉజ్వల భవిష్యత్తుకు సూచిక: నిర్మల

నారీ శక్తి.. ఇండియా ఉజ్వల భవిష్యత్తుకు సూచిక: నిర్మల

న్యూఢిల్లీ: మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయబోయే నిధులను కేంద్ర ప్రభుత్వం కొంత పెంచింది. మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు  25 వేల 172 కోట్ల రూపాయలు కేటాయించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 24 వేల 435 కోట్ల రూపాయల కంటే ఇది 3 శాతం ఎక్కువ. ‘నారీ శక్తి’ ఇండియా ఉజ్వల భవిష్యత్తుకు సూచిక అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్​ప్రసంగంలో పేర్కొన్నారు. మహిళల సారథ్యంలో జరిగే అభివృద్ధి చిరకాలం నిలిచి ఉంటుందన్నారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ పరిధిలోని పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామన్నారు.
ఏ కార్యక్రమానికి ఎంతంటే..
మహిళల, పిల్లల సమగ్ర ప్రయోజనాల కోసం కేంద్ర సర్కార్ ఇటీవల మిషన్​ శక్తి, మిషన్​ వాత్సల్య, సక్షమ్​అంగన్​వాడీ, పోషన్2 కార్యక్రమాలను ప్రారంభించింది. తాజా బడ్జెట్​లో సక్షమ్ ​అంగన్​వాడీ, పోషన్ 2  కోసం  20 వేల 263 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది గతంలో ఖర్చు చేసిన 20వేల 105 కోట్ల రూపాయల కంటే రూ.158 కోట్లు ఎక్కువ. మహిళల భద్రత, సాధికారత టార్గెట్​గా ప్రవేశపెట్టిన మిషన్ ​శక్తి  ప్రోగ్రామ్ కోసం రూ.3వేల 184 కోట్లు కేటాయించారు. ఇది 2021–22లో ఖర్చు చేసిన దానికంటే రూ.75 కోట్లు ఎక్కువ. పిల్లల రక్షణ, సంక్షేమం కోసం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య కోసం రూ.1,472 కోట్లు అలకేట్ చేశారు. ఈ కార్యక్రమం కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. ఈ బడ్జెట్​లో ఏకంగా రూ.572 కోట్లు పెంచారు.

బ్యూరోక్రాట్ల ట్రైనింగ్​కు రూ.288 కోట్లు
న్యూఢిల్లీ: దేశ, విదేశాల్లో బ్యూరోక్రాట్‌‌‌‌లకు శిక్షణ, అవసరమైన మౌలిక సదుపాయాలను పెంపొందించడం కోసం వచ్చే ఫైనాన్షియల్ ​ఇయర్​కు పర్సనల్​మినిస్ట్రీకి ఈ బడ్జెట్​లో రూ.288 కోట్లకు పైగా కేటాయించారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ​రిఫార్మ్స్, పెన్షనర్స్ ​స్కీమ్స్ కింద మరో రూ. 44.25 కోట్లు అలొకేట్​ చేశారు. రూ. 288.14 కోట్ల మొత్తం కేటాయింపుల్లో ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ను (ఎల్‌‌‌‌బిఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎఎ)ను అప్​గ్రేడ్ ​చేయనున్నారు. ఢిల్లీ బేస్డ్ ఇన్​స్టిట్యూట్ ​ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్​మేనేజ్​మెంట్​లోనూ సౌలతులు పెంచనున్నారు. డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఖర్చుల కోసం రూ.77.39 కోట్లు కేటాయించారు. దీని అటానమస్​ బాడీస్ అయిన గృహ కల్యాణ్​ కేంద్రం,  సెంట్రల్​ సివిల్ ​సర్వీసెస్ ​కల్చరల్ ​అండ్ ​స్పోర్ట్స్ ​బోర్డ్, నేషనల్ ​రిక్రూటింగ్​ఏజెన్సీ(ఎన్​ఆర్​ఏ)కి గ్రాంట్ ​ఇన్ ​ఎయిడ్ ​సాయం అందించేందుకు మరో రూ. 399.20 కోట్లు ఇచ్చారు. సెంట్రల్​ అడ్మినిస్ట్రేటివ్​ట్రిబ్యునల్​కు రూ.159 కోట్లు, స్టాఫ్​సెలక్షన్​కమిషన్(ఎస్ఎస్​సీ)కు రూ. 263 కోట్లు కేటాయించారు.