- గతేడాదితో పోలిస్తే 13 % తగ్గింపు
న్యూఢిల్లీ: గ్రామీణాభివృద్ధి శాఖకు, ఉపాధి హామీ పథకానికి కోత పడింది. గతేడాదితో పోలిస్తే నిధులు తగ్గాయి. గతేడాది రూరల్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీకి రూ.1,81,121 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.1,57,545 కోట్లు ఇవ్వను న్నట్లు బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. అంటే నిరుటితో పోలిస్తే 13 శాతం ఫండ్స్ తగ్గాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కూడా కేటాయింపులు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే 32 శాతం తక్కువగా.. ఈసారి 60 వేల కోట్లను ఉపాధికి కేంద్రం ఇచ్చింది. నిరుడు మాత్రం 89,400 కోట్లు ఇచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)కు నిధులు పెంచారు. గతేడాది రూ.48,422 కోట్లు ఇవ్వగా.. ఈసారి మాత్రం 54,487 కోట్లు కేటాయించారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజనకు గతేడాది మాదిరే రూ.19 వేల కోట్లు కేటాయించారు.
