Online Gaming Bill: ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఇకపై ఆన్ లైన్లో బెట్టింగ్ పెడితే..

Online Gaming Bill: ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఇకపై ఆన్ లైన్లో బెట్టింగ్ పెడితే..

న్యూఢిల్లీ: ఆన్ లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్ లైన్ బెట్టింగ్ను ఇకపై తీవ్ర నేరంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేదికగా బెట్టింగ్కు పాల్పడితే శిక్ష తప్పదని, భారీ జరిమానాలు విధించే విధంగా ఆన్ లైన్ గేమింగ్ బిల్లును రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. ఆన్ లైన్ గేమింగ్ బిల్లును బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఆన్ లైన్ గేమింగ్ ఫ్లాట్ఫామ్స్పై కేంద్రమే నేరుగా నిఘా పెట్టనుంది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్స్ ఆగడాలకు మన దేశంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. చేపకు గాలం వేసినట్టు కొత్త కస్టమర్లకు మొదట్లో రూ. వందకు రూ. రెండొందలు.. రూ. వెయ్యికి రెండు వేలు, మూడు వేలు ఇస్తూ మెల్లిగా ఊబిలోకి లాగుతున్నారు.

ఈజీ మనీ కోసం అత్యాశతో కొందరు, వ్యసనాల బారిన పడి ఇంకొందరు.. పగలు, రాత్రి తేడా లేకుండా 24  నాలుగు గంటలూ ఆన్​లైన్​ బెట్టింగ్​గేమ్స్​లో మునిగితేలుతున్నారు. గతంలో ఈ వ్యసనం కొంతమంది యువత వరకే పరిమితమవగా..ఇప్పుడది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, సాఫ్ట్​వేర్​ఇంజినీర్లు, బ్యాంకర్లు..అనే తేడా లేకుండా ప్రతి రంగానికి చేరింది. అయితే..ఈ బెట్టింగ్​ఆడే ప్రతి వంద మందిలో దాదాపు 95 శాతం మంది చేతులు కాల్చుకుని, ఆర్థికంగా చితికిపోతున్నారు. డబ్బుల కోసం కొందరు అడ్డదారి తొక్కుతుండగా..అవమానంగా భావించేవారు తమ ప్రాణాలతోపాటు కుటుంబ సభ్యుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకపై ఈ ఆన్ లైన్ బెట్టింగ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఆన్ లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపింది. 

ఇక.. తెలంగాణలో ఆన్​లైన్ ​బెట్టింగ్​ యాప్స్పై నిషేధమున్నా కొత్తగా రోజుకో 4  బెట్టింగ్​ యాప్స్​ పుట్టుకొస్తున్నాయి. యూట్యూబ్​, సోషల్​మీడియా, వెబ్​సైట్లు ఓపెన్​చేయడమే ఆలస్యం బెట్టింగ్​యాప్స్ యాడ్స్​ కనిపిస్తున్నాయి. ఏదైనా పెద్ద ఘటన.. లేదంటే కుటుంబ సభ్యులు వీటి బారినపడి బలైన చోట మాత్రమే ఫిర్యాదు ఆధారంగా పోలీసులు స్పందిస్తున్నారు. లేదంటే ఇది తమ పనికాదన్నట్టు లైట్​తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. దీంతో ఆన్​లైన్ ​బెట్టింగ్ ​నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ఒక్కరే వివిధ పేర్లతో బిజినెస్​నడిపిస్తున్నారు. కొత్త కస్టమర్లను పరిచయం చేసే రెగ్యులర్​కస్టమర్లకు డబ్బుల రూపంలో కమీషన్​ ఇస్తుండడంతో ఒకరిద్వారా మరొకరు రోజుకు వందలు, వేల సంఖ్యలో కొత్తగా ఆన్​లైన్​బెట్టింగ్స్​, గేమ్స్​ఆడేందుకు రెడీ అవుతున్నారు.