5జీ ని మన సొంత టెక్నాలజీతో రూపొందించాం: నిర్మలా సీతారామన్

5జీ ని మన సొంత టెక్నాలజీతో రూపొందించాం: నిర్మలా సీతారామన్

వాషింగ్టన్: 5జీ సేవలు మన సొంత టెక్నాలజీతో రూపొందించామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తన్న నిర్మలా సీతారామన్.. 5జీ సేవలపై మాట్లాడారు. దేశంలో 5జీ సేవలను ప్రధాని మోడీ ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారని మంత్రి తెలిపారు. చాలా దేశాలు 5జీ సేవల కోసం భారత్ ను సంప్రదిస్తున్నాయని, ఇది మనకు చాలా గర్వకారణమని నిర్మలా సీతారామన్ చెప్పారు.

2024 వరకు 5జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని పేర్కొన్నారు. 5జీ సర్వీసులతో టెలీకమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి అన్నారు. సమాచార రంగంలో మరిన్ని సేలు అందుబాటులోకి వస్తాయని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు.