తెలంగాణ కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు సరికాదు

తెలంగాణ కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు సరికాదు

బియ్యం సేకరణపై కేంద్రంపై చేస్తున్న వార్తలు అవాస్తవమన్నారు కేంద్ర  ఫుడ్ సెక్రటరీ సుధాంశు పాండే. రాష్ట్రాల దగ్గర నుంచి తీసుకోవాల్సిన బియ్యం ఇంకా ఉందనేది అవాస్తవమన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. బియ్యం సేకరణఫై అన్ని రాష్ట్రాలను  వివరాలు కోరామన్నారు.  ముందుగా ఇచ్చిన సమాచారం మేరకే బియ్యం సేకరిస్తామన్నారు. ఎఫ్ సీఐ దగ్గర ఇప్పటికే 40 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ఉందన్నారు. తెలంగాణ విజ్ఞప్తి మేరకు మరో 20 లక్షల టన్నులు సేకరించామన్నారు.

ధాన్యం  సేకరణ అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. రైతులకు అవగాహన కల్పించాల్సిన బాద్యత రాష్ట్రాలదేనన్నారు. పంజాబ్ నుంచి ఒక్క గింజ కూడా బాయిల్డ్ రైస్ తీసుకోలేదన్నారు. తెలంగాణ నుంచి ఎంత రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామన్నారు. బియ్యం సేకరణలో ఏ రాష్ట్రంపై వివక్ష లేదన్నారు.  ఏజెంట్ గా మాత్రమే రాష్ట్రాలు ధాన్యాన్ని సేకరిస్తాయన్నారు. ఏపీ రా రైస్ ఇస్తుందని.. తెలంగాణకు ఇబ్బందేంటని ప్రశ్నించారు. రా రైస్ ఇవ్వబోమని తెలంగాణ అగ్రిమెంట్ రాసుకుందన్నారు.  ఎఫ్ సీఐ నేరుగా ధాన్యం సేకరించడం సాధ్యం కాదన్నారు.

 

ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం

ఉద్యమకారులను సన్మానించలేదని ఏం చేశారంటే..