ఒకే రోజు 4 వేల మంది మృతి

ఒకే రోజు 4 వేల మంది మృతి

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 43 వేల 144 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 40 లక్షల 46 వేలు దాటింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా మరో 4 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2 లక్షల 62 వేలు దాటింది. నిన్న 3 లక్షల 44 వేల 776 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2 కోట్లు దాటింది. ప్రస్తుతం దేశంలో 37 లక్షల 4 వేల 893 యాక్టివ్ కేసులున్నాయి.  ఇప్పటివరకూ దేశంలో 17 కోట్ల 92 లక్షల 98 వేల 584 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.