సీఏఏపై కాంగ్రెస్​ది లేనిపోని రాద్ధాంతం: అమిత్​షా

సీఏఏపై కాంగ్రెస్​ది  లేనిపోని రాద్ధాంతం: అమిత్​షా

ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దని సూచన

సిమ్లా: సిటిజన్​షిప్ సవరణ చట్టంపై ప్రజల్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్​షా ఆరోపించారు. ఈ చట్టంలో సిటిజన్​షిప్​ను తొలగించే రూల్ లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ముస్లింలు తమ సిటిజన్​షిప్​ను కోల్పోతారని పుకార్లు వ్యాప్తి చేస్తూ లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు. హిమాచల్​ప్రదేశ్​లో అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా శుక్రవారం సిమ్లాలో జరిగిన సభలో పాల్గొన్న అమిత్​షా కాంగ్రెస్​పై ఫైర్ అయ్యారు. సీఏఏలో సిటిజన్​షిప్​రద్దుకు సంబంధించిన ఒక్క లైన్ అయినా ఉన్నట్లు చూపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సవాల్ చేశారు. ఈ చట్టం ద్వారా ఎవరి సిటిజన్​షిప్ ​పోదని, ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు, విభజించవద్దు’’ అని అమిత్​షా కోరారు. ప్రభుత్వ వెబ్​సైట్​లలో అందుబాటులో ఉన్న సీఏఏను మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు పరిశీలించాలని సూచించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లలో మతపరమైన హింసను ఎదుర్కొన్న మైనార్టీలకు సీఏఏ సిటిజన్​షిప్​ కల్పిస్తుందని చెప్పారు. మైనారిటీల రిలీజియస్, ఇతర హక్కుల పరిరక్షణకు నెహ్రూ– లియాఖత్ ఒప్పందాన్ని అమలు చేయడంలో పాకిస్తాన్ ఫెయిల్ అయిందని, అదే సీఏఏ చట్టాన్ని రూపొందించేందుకు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రేరేపించిందని అమిత్​షా అన్నారు.

రాహుల్.. లయర్​ ఆఫ్​ ది ఇయర్

కాంగ్రెస్​ ప్రెసిడెంట్​గా ఉన్న టైంలో నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడం రాహుల్​కు అలవాటైంది. ప్రెసిడెంట్​ పోస్టు పోయినా.. ఆ అలవాటు మాత్రం పోలేదు. ఆయన చేసే కామెంట్లు గతంలో ఆయన కుటుంబాన్ని, కాంగ్రెస్​ పార్టీనే ఇబ్బంది పెడుతుండేవి. ఇప్పుడైతే ఏకంగా దేశాన్ని కూడా కలవరపెడుతున్నాయి. లయర్​ ఆఫ్​ ది ఇయర్​ కేటగిరీ గనక ఉంటే.. ఆ అవార్డు అందుకునే అర్హత రాహుల్​కు మాత్రమే ఉంది.- కేంద్ర మంత్రి ప్రకాశ్​ జవదేకర్

Union Home Minister Amit Shah accused Congress of misleading people on Citizenship Amendment Act