ఆర్థికలోటు తగ్గించడం గొప్ప విజయం

ఆర్థికలోటు తగ్గించడం గొప్ప విజయం

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ బడ్జెట్  దార్శనికతగా ఉందని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఇది సహాయ పడుతుందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతున్నట్లు బడ్జెట్ లో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. మోడీ ప్రభుత్వం తీవసుకొచ్చిన ఈ బడ్జెట్ దూరదృష్టితో కూడిదని....ఇది భారత ఆర్థిక వ్యవస్థ స్థాయిని మార్చే బడ్జెట్ గా రుజువు చేస్తుందని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చడానికి ఈ బడ్జెట్ సహాయపడుతుందని చెప్పారు. ఆర్థిక లోటు 6.9 నుంచి 6.4 శాతానికి తగ్గించడం గొప్ప విజయమని చెప్పారు. మోడీ నాయకత్వంలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించామని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

దలాల్ స్ట్రీట్కు బడ్జెట్ జోష్

ఇది మోసపూరిత బడ్జెట్