దలాల్ స్ట్రీట్కు బడ్జెట్ జోష్

దలాల్ స్ట్రీట్కు బడ్జెట్ జోష్

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బడ్జెట్ ఇచ్చిన జోష్తో ట్రేడింగ్ ఆద్యంతం లాభాల్లోనే సాగింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపింది. వివిధ రంగాలకు ఊతమిచ్చేలా బడ్జెట్ లో చేసిన ప్రతిపాదనలు మార్కెట్కు కలిసొచ్చాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 6.9శాతానికి పరిమితమవుతుందన్న అంచనాలు, ఆర్థికాభివృద్ధికి మౌలిక రంగంలో కొత్త పెట్టుబడులకు ఆహ్వానం పలకడం, డిజిటల్ రూపీ ప్రతిపాదన, 2023 ఆర్థిక సంవత్సరంలో 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రకటన మదుపర్లలో ఉత్సాహం నింపింది. 

ఉదయం 58,672.86 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్లో 57,737.66 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరింది. అనంతరం లభించిన కొనుగోళ్ల మద్దతుతో 59,032.20 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరిన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 848.40పాయింట్ల లాభంతో 58,862.57 వద్ద క్లోజయింది. టాటా స్టీల్, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రాఫిట్ గెయిన్ చేశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, రిలయన్స్ వాటాలు నష్టాలు మూటగట్టుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా లాభాల్లోనే ముగిసింది. 237 పాయింట్ల ప్రాఫిట్ తో 17,576.85 వద్ద క్లోజయింది.