ఇయ్యాల హైదరాబాద్‌‌కు  అమిత్‌‌ షా రాక

ఇయ్యాల హైదరాబాద్‌‌కు  అమిత్‌‌ షా రాక

రేపు హకీంపేట్‌‌లో రైజింగ్‌‌ డే పరేడ్​కు అటెండ్​ కానున్న కేంద్ర హోం మంత్రి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా హైదరాబాద్​ రానున్నారు. శనివారం సాయంత్రం 6:15కు ఢిల్లీలో బయలుదేరి.. రాత్రి 8.25కు హకీంపేట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్‌‌‌‌ జిల్లా హకీంపేట్‌‌‌‌లోని నేషనల్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ సెక్యూరిటీ అకాడమీ(ఎన్‌‌‌‌ఐఎస్‌‌‌‌ఏ)కి వస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

రాత్రి 9.30కు అధికారులతో భేటీ అవుతారు. ఆదివారం ఉదయం 7.30 నుంచి 9.16 వరకు సెంట్రల్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌) 54వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా నిర్వహించే రైజింగ్‌‌‌‌ డే పరేడ్‌‌‌‌లో పాల్గొంటారు. తర్వాత 11.45 గంటలకు హకీంపేట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు చేరుకొని, కేరళ వెళ్తారు. శనివారం రాత్రి 9:30కు, ఆదివారం ఉదయం 9:30 నుంచి 11:30 మధ్య బీజేపీ రాష్ట్ర నేతలతో అమిత్​షా సమావేశమయ్యే అవకాశం ఉంది.