అజాగ్రత్త వద్దు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

అజాగ్రత్త వద్దు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

కరోనా కేసులు తగ్గుతున్నాయి కదా అని అజాగ్రత వద్దని రాష్ట్రాలను హెచ్చరించింది కేంద్రం. తీవ్రత తగ్గడంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చాయని..... అయితే నిబంధనల విషయంలో సీరియస్ గా ఉండాలని ఆదేశించింది. రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో సీఎస్ లకు సూచనలు చేస్తూ లెటర్ రాశారు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్ ను ఆపొద్దని ఆదేశించారు. కరోనా చైన్ ను బ్రేక్ చేయడంలో వ్యాక్సినేషన్ కీలకమన్నారు. సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు వాడకం తప్పనిసరి అన్నారు. ఏమాత్రం అజాగ్రత్త వద్దని హెచ్చరించారు. నిబంధనలు పకడ్బంధీగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ లకు సూచించారు అజయ్ భల్లా. లాక్ డౌన్ సడలింపులను క్లోజ్ గా మానిటర్ చేయాలన్నారు.