 
                                    - తక్షణ సాయంగా రూ. 50 వేలు ప్రకటించిన కేంద్ర మంత్రి
హుస్నాబాద్, వెలుగు: భారీ వర్షాలతో వరద నీళ్లలో పంట కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పోతారం(ఎస్) గ్రామానికి చెందిన రైతు కెడికె తారవ్వకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అండగా నిలిచారు.
ఢిల్లీలో ఉన్న ఆయన.. గురువారం విషయం తెలుసుకున్న వెంటనే తారవ్వకు ఫోన్ చేసి, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకొని ఆమెకు ధైర్యం చెప్పారు. తక్షణ సాయంగా రూ.50 వేల ఆర్థిక సాయాన్ని బండి సంజయ్ ప్రకటించారు. ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును హుస్నాబాద్ బీజేపీ నేత ద్వారా తారవ్వకు అందించేలా ఏర్పాట్లు చేశారు.

 
         
                     
                     
                    