మావోయిస్టులతో మాటల్లే వ్.. మాట్లాడుకోడాల్లేవ్: బండి సంజయ్

మావోయిస్టులతో మాటల్లే వ్.. మాట్లాడుకోడాల్లేవ్: బండి సంజయ్

కొత్తపల్లి: మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టంచేశారు. తుపాకీ వీడనంత వరకు వారితో మాట్లాడే ఊసే ఉండదని తెలిపారు. కరీంనగ ర్ లోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ..'మావోయిస్టులతో ఇక మాటల్లే వ్.. మాట్లాడుకోడాల్లేవ్. తుపాకీ చేతపట్టి అమా యకులను పొట్టనపెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవ్. మావోయిస్టులపై నిషేధం విధించింది కాంగ్రెస్సే. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చం పినోళ్లు నక్సల్స్, అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపారు. ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నాయి' అని ఫైర్అయ్యారు.

కేంద్రం కుల గణన నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకం

'కేంద్రం కుల గణన నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకం. ఇది కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణను పొంతనే ఉండదు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీల జనాభాను తగ్గించి చూపారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు. ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోంది. పాస్ పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదు' అని బండి ప్రశ్నించారు.