ఫోన్ ట్యాపింగ్పై తడిబట్ట ప్రమాణానికి సిద్దం: బండి సంజయ్

ఫోన్ ట్యాపింగ్పై తడిబట్ట ప్రమాణానికి సిద్దం: బండి సంజయ్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్వవహారంలో బీఆర్ ఎస్ నేత కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తడిబట్ట ప్రమాణానికి నేను సిద్దంగా ఉన్నారు.. ఏ గుడికి రావాలో టైం చెప్పు వస్తానంటూ కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. 

నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. కేటీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ చేయించారని నాకు తెలుసు. మావోయిస్టు సానుభూతిపరులుగా మా నంబర్లను పోలీసులకు ఇచ్చారని అన్నారు. 

మా ఫోన్లే కాదు  బీఆర్ ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. బీఆర్ ఎస్ నేతలకు సిగ్గు ఉంటే ఆ పార్టీ వీడి బయటికి రావాలని అన్నారు బండి సంజయ్. హైకోర్టు జడ్జీలు, భార్యభర్తల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. మాజీ మంత్రి కేటీఆర్ ఏ గుడికి, ఎప్పుడు రమ్మంటారో చెబితే తాను భార్యా పిల్లలతో వస్తానని సవాలు విసిరారు. ‘ మా గుడులపై నమ్మకం లేకుంటే మీరు ఏదైనా మసీదు, చర్చి పేరు చెప్పినా ఫరవాలేదు.. కేటీఆర్, కేసీఆర్ కుటుంబంతో రావాలె..’ అని అన్నారు. 

►ALSO READ | రాహుల్ గెలిస్తే ఏ తప్పుండదు.. బీజేపీ గెలిస్తే తప్పు జరిగినట్టా?

నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. కేటీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ చేయించారని నాకు తెలుసు. మావోయిస్టు సానుభూతిపరులుగా మా నంబర్లను పోలీసులకు ఇచ్చారని అన్నారు. మా ఫోన్లే కాదు  బీఆర్ఎస్ మంత్రులు, లీడర్లు, ఎమ్మెల్యేలు, వ్యాపారస్తులు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుంటే ఆ పార్టీ నుంచి బయటికి రావాలని అన్నారు.  ఫోన్ ట్యాపింగ్ తో కేటీఆర్.. వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. హైకోర్టు జడ్జీలు, భార్యభర్తల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. 

కేసీఆర్ కు వేల కోట్ల  రూపాయలు ఎక్కడినుంచి వచ్చాయి.. ఫోన్ ట్యాపింగ్ తో బ్లాక్ మెయిల్ చేసిన సంపాదించారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో కేసీఆర్ మమత బెనర్జీకి ఎన్నికల ఫండ్ ఇచ్చారని అన్నారు. అంతే కాదు మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ముంబై వెళ్లి ఎన్నికల ఫండ్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు బండి సంజయ్.