కొత్త మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ ప్రతిపాదనలు పంపలే

V6 Velugu Posted on Dec 03, 2021

కొత్త మెడికల్ కాలేజేల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, కొత్త ఏర్పాటు చేయబోయే కాలేజీలకు సంబంధించింది కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు.. ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి పవార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కొత్త స్కీం కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 75 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. 

ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద  రూ. 1028 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ మంజూరైందని.. 2024 నాటికి నిర్మాణం పూర్తవుతుందని ఆమె  చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 35 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులున్నాయని తన లేఖలో తెలిపారు. 12 ప్రభుత్వ, 23 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయన్నారు. వీటిలో 5 వేల 2 వందల 40 ఎంబీబీఎస్ సీట్లు, 2 వేల 2 వందల 37 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయని చెప్పారు. 

Tagged Bibinagar AIIMS, Union Minister Bharathi Pawar, lokhsabha

Latest Videos

Subscribe Now

More News