పెరుగుతున్న ఆయిల్ ధరలపై సరైన టైమ్లో నిర్ణయం :కేంద్ర మంత్రి హర్దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ పూరి

పెరుగుతున్న ఆయిల్ ధరలపై సరైన  టైమ్లో నిర్ణయం :కేంద్ర మంత్రి హర్దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ పూరి
  • ఇజ్రాయిల్‌‌‌‌– పాలస్తీనా వార్‌‌ను గమనిస్తున్నాం

న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ – పాలస్తీనా వార్‌‌ను జాగ్రత్తగా గమనిస్తున్నామని, ఆయిల్ అవసరాలను మెచ్యూరిటీతో పరిష్కరిస్తామని కేంద్ర ఆయిల్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ హర్దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ పూరి పేర్కొన్నారు. గ్లోబల్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు సెంటర్ పాయింట్ అయిన మిడిల్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌లో ఈ యుద్ధం జరుగుతోందని అన్నారు. అనిశ్చితి పరిస్థితుల  నుంచి బయటపడతామని, ప్రజలు  క్లీన్ ఎనర్జీకి మారడానికి ఇలాంటి పరిస్థితులు సాయపడతాయని అభిప్రాయపడ్డారు.
హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ సెక్యూరిటీస్ రిపోర్ట్ ప్రకారం, ఇండియా ఆయిల్ దిగుమతులకు  సమీప కాలంలో  ఎటువంటి ఇబ్బంది లేదు. ఇజ్రాయిల్‌‌‌‌ గాని, దీని సరిహద్దు దేశాల నుంచి గాని  మనం పెద్దగా ఆయిల్‌‌‌‌ను దిగుమతి చేసుకోవడం లేదు. ఇజ్రాయిల్‌‌‌‌ – పాలస్తీనా  వార్‌‌ ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలకు పాకితే మార్కెట్‌‌‌‌లు భారీగా పడతాయని హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్  దీపక్ జాసాని అన్నారు. అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌, హమాస్‌‌‌‌ సపోర్టర్ అయిన ఇరాన్ వైపు ట్రేడర్ల దృష్టి మరలిందని చెప్పారు.